సౌందర్య లహరి

31. చతుష్షష్ట్యాతంత్రైః సకల మతి సంధాయ భువనం
స్థితస్తత్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైఃపశుపతిః
పునస్త్వన్నిర్బంధాదఖిలపురుషార్థైకఘటనా
స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరమిదమ్.

తాత్పర్యం : అమ్మా! పశుపతి అయిన శివుడు జీవులని తృప్తి పరచటానికి రకరకాలైన విధివిధానాలతో కూడిన 64 రకాలైన తంత్రాలని, వేరు వేరు ఫలితాలని ఇవ్వటానికి లోకానికి అందించి జీవులని వ్యామోహంలో చిక్కుకునేట్టు చేశాడు. నీ బిడ్డలైన జీవులపై ఉన్న వాత్సల్యంతో వారు వ్యామోహంలో చిక్కుకోవటం ఇష్టంలేని నీవు,శివుణ్ణి ప్రేమతో నిర్బంధించావు. నీ ప్రేమకి లొంగి పోయిన శివుడు పరమపురుషార్థప్రదమైన, నీకు సంబంధించిన శ్రీవిద్యాతంత్రాన్నిభూలోకవాసులకి ప్రసాదించాడు.

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *