voltage | పాల రంగంలో నూతన దిశ…

voltage | పాల రంగంలో నూతన దిశ…

voltage | ఓబుల దేవర చెరువు, ఆంధ్రప్రభ : పాల ఉత్పత్తి రంగాన్ని మరింత ఆధునికీకరించాలనే లక్ష్యంతో జైకా సంస్థ సహకారంతో శ్రీజ డైరీ ఆధ్వర్యంలో ఎం.బి. క్రాస్‌లో మంగళవారం నిర్వహించిన పాలమిత్రల అవగాహనా శిబిరం హై వోల్టేజ్ వాతావరణంలో సాగింది. పాల నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు, పశుసంరక్షణలో తాజా మార్గదర్శకాలపై నిపుణులు విపులంగా వివరించడంతో పాలమిత్రల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

శ్రీజ డైరీ ఏరియా ఆఫీసర్ సాంబాశివారెడ్డి, సూపర్వైజర్ హరీష్ నాయుడు, పిఐబి ఎగ్జిక్యూటివ్ సహదేవరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని, పాల సేకరణలో పాటించాల్సిన ప్రమాణాలు, నిల్వ విధానాలు, పరిశుభ్రత చర్యల ప్రాముఖ్యతను స్పష్టంగా వివరించారు. రైతుల ఆదాయ వృద్ధి, వినియోగదారులకు నాణ్యమైన పాలు అందించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో పశువులకు సమతుల్య ఆహారం, తగిన తాగునీరు, షెడ్లలో గాలి ప్రసరణ, వ్యాధి నిరోధక చర్యలపై ప్రత్యేక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా పిఐబి ఎగ్జిక్యూటివ్ సహదేవరెడ్డి కీలక ప్రకటన చేస్తూ, ఎన్‌డీడీబీ (NDDB) సహకారంతో 10వ తరగతి, ఇంటర్మీడియట్‌లో 65 శాతం పైగా మార్కులు సాధించిన పాల ఉత్పత్తిదారుల కుటుంబాల విద్యార్థులకు రూ.20,000 స్కాలర్షిప్ అందించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఆనందం వెల్లివిరిసింది. కార్యక్రమం ముగింపులో ఏరియా ఆఫీసర్ సాంబాశివారెడ్డి పాలమిత్రలకు ఎగ్జిక్యూటివ్ బ్యాగులు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఎం.బి. క్రాస్ పరిధిలోని పాలమిత్రలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, సూపర్వైజర్ హరీష్ నాయుడు సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Leave a Reply