108.44 cr | వేగంగా పూర్తి చేయాలి

108.44 cr | వేగంగా పూర్తి చేయాలి

108.44 cr | మచిలీపట్నంఆంధ్రప్రభ : జిల్లాలో ఉపాధి హామీ పనులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత లక్ష్యం మేరకు వచ్చే మార్చి నెల 15వ తేదీలోగా వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి క్షేత్రాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉపాధి హామీ పనుల పురోగతిపై సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 108.44 కోట్ల రూపాయల మేరకు ఉపాధి హామీ పనులు చేపట్టవలసి ఉండగా ఇప్పటివరకు 47 కోట్ల రూపాయల మేరకు పురోగతి సాధించారన్నారు. అందులో 43 శాతం మేరకు బిల్లులను చెల్లింపు కోసం అప్లోడ్ చేశారన్నారు. మిగిలిన 61 కోట్ల రూపాయల పనులను ఎట్టి పరిస్థితుల్లోనైనా మార్చి 15వ తేదీ లోగా పూర్తి చేసి అందుకు సంబంధించిన బిల్లులను అప్లోడ్ చేయాలన్నారు.

ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు మురిగిపోకుండా సకాలంలో సద్వినియోగం చేసుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లోడ్వామా పిడి కే శివప్రసాద్, పంచాయతీరాజ్ ఎస్ ఈ రమణ రావు, పలువురు ఏపీవోలు డి ఈఈ లు, ఏఈ లు పాల్గొన్నారు.

Leave a Reply