Congress | ప్రజా సేవకుని కే కాంగ్రెస్ పెద్దపేట..

Congress | ప్రజా సేవకుని కే కాంగ్రెస్ పెద్దపేట..

వైరా మున్సిపల్ చైర్ పర్సన్ గా కాపా డాక్టర్ కాపా చంద్రకళ

Congress | వైరా, ఆంధ్రప్రభః వైరా మున్సిపల్ చైర్మన్గా డాక్టర్ కాపా చంద్రకళ నియమితులయ్యారు. ఆరో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి మెజార్టీ ఓట్లతో గెలిచిన ఆమెకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చైర్మన్ పదవిని బహుమానంగా ఇచ్చింది. కథ 20 ఏళ్లుగా సంఘ సేవకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా.. వైరా మున్సిపాలిటీని అభివృద్ధిలో ఐటెక్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు గాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో వైరా మున్సిపాలిటీలో హర్షాతిరేకాలు వెల్లి విరిసాయి. ఈ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ విప్ గా వ్యవహరించారు .. వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచినా 12 మంది కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థి, మరొక ఓటు ఎమ్మెల్యే తో 14 మంది కాపా చంద్రకళ ను, వైస్ చైర్మన్గా కట్ల సంతోష్ ను ప్రతిపాదించడంతో మెజార్టీ ఓట్లతో వారి ఇరువురు చైర్మన్,వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.. రిటర్నింగ్ అధికారి ఆర్డీవో గరీడు నరసింహారావు చేతుల మీదుగా నియామక పత్రాలను డాక్టర్ కాపా చంద్రకళ కట్ల సంతోష్ అందుకున్నారు..

విధేయతకు దక్కిన గౌరవం..
వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా కట్ల సంతోష్ నియామకంపై హర్షం..

కాంగ్రెస్ పార్టీలో కట్ల కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది.. ఆ కుటుంబం అంటేనే కాంగ్రెస్ కుటుంబంగా పేరు ఉంది… ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చిన వారు మాత్రం కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ ను అంటిపెట్టుకొని కాంగ్రెస్ అభివృద్ధి కోసం పని చేస్తున్నారు… వివిధ పార్టీల నుండి ఎన్నో అవకాశాలు పదవులు ఇస్తామంటూ ఆఫర్లు వచ్చిన లెక్కచేయకుండా తాము నమ్ముకున్న పార్టీ కోసం ఆ పార్టీని కన్నతల్లిలా భావిస్తూ… కాంగ్రెస్ జెండాను భుజాన వేసుకొని మోస్తూ కాంగ్రెస్ వీరాభిమానులుగా వెలుగొందుతున్నారు… అటువంటి కట్ల కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది… ప్రస్తుతం పిసిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న కట్ల రంగారావు ఆధ్వర్యంలో అతని తమ్ముడు కట్ల సంతోష్ చిన్ననాటి నుండి కాంగ్రెస్ భావాజాలంతో మూడు రంగుల జెండా అంటే అమితమైన విశ్వాసం ఇష్టంతో, విద్యార్థి సంఘం ఎన్ ఎస్ యు ఐ నాయకుడిగా తదుపరి యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన కట్ల సంతోష్ కు వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా పదవి ఇవ్వటం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది.. నమ్ముకున్నా సిద్ధాంతాలు కట్టుబడి ఉన్న ఆయనకు ఆ కుటుంబానికి పార్టీ వెన్నుదండిగా ఉండి అక్కున చేర్చుకున్నందుకు అధిష్టానం పై కార్యకర్తల కు విశ్వాసం మరింత పెరిగింది.. విధేయతకు గౌరవిస్తూ కట్ల సంతోష్ కు పదవిని బహుమానంగా అందించారు.. 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మెజార్టీ ఓట్లతో గెలిచిన ఆయనకు మున్సిపాలిటీలో క్రియాశీల పదవిని ఇవ్వటం ప్రస్తుతం చర్చ నియాంశంగా మారింది… ఈ మేరకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న ఆర్డీవో నరసింహారావు వైస్ చైర్మన్ గా కట్ల సంతోష్ కు నియామక పత్రాన్ని అందజేశారు..

Leave a Reply