Chairman | చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ ..

Chairman | చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ ..
పరకాల మున్సిపల్ చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్
వైస్ చైర్మన్ గా ఏకు దివ్య
ఏకగ్రీవం చేసిన కౌన్సిలర్లు
Chairman | పరకాల, ఆంధ్రప్రభ: పరకాల పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు పురపాలక సంఘంలో 22 మంది వార్డు కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ 13 మంది కౌన్సిలర్స్ 7వ వార్డు కౌన్సిలర్ పావుశెట్టి సునీల్ కుమార్ ను పరకాల మున్సిపల్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా 4వ వార్డు కౌన్సిలర్ ఏకు దివ్యను పురపాలక సంఘం వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పట్టణంలోని శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో అర్చకులు కొమ్మలపల్లి సంపత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని మాదారం పోచమ్మ గుడి, బస్టాండ్ మీదుగా, అంబేద్కర్ సెంటర్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

