13 people | జనగామ చైర్మన్ పీఠం ఎవరికి దక్కేను…

13 people | జనగామ చైర్మన్ పీఠం ఎవరికి దక్కేను…
13 people | జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి : జనగామ మున్సిపల్ చైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందని ఊహాదానాలు జోరందుకున్నాయి కానీ చైర్మన్ పీఠం దక్కాలంటే క్యాంప్ వీడి మున్సిపల్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఇండిపెండెంట్ అభ్యర్థులు నలుగురులో ముగ్గురు ఎవరికి మద్దతు తెలుపుతారని ఉత్కంఠ కొనసాగుతుంది జనగామ మున్సిపల్ చైర్మన్ పీటం ఎవరికి దక్కుతుందో చూడవలసింది టిఆర్ఎస్ పార్టీ నుండి గోపగోని సుగుణాకర్ గౌడ్ ను కాంగ్రెస్ పార్టీ నుండి కడగంచి బాలమణి శ్రీనివాస్ పేర్లను ఆయా పార్టీలు సూచించినట్లు తెలిసింది దీంతో మున్సిపల్ సమావేశానికి కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలో నుండి గెలిచిన అభ్యర్థులు సమానంగా ఉండడంతో ఇప్పుడు చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ పరిస్థితి నెలకొంది ఉత్తమ పంతం నెగ్గించుకునేందుకు ఇరు పార్టీల భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి జనగామ స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిలు వ్యూహాత్మకంగా నాలుగు ఇండిపెండెంట్ గురి పెట్టుకున్నారు. సోమవారం జనగామ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక ఉండడంతో జనగామలో ఎలాంటి అవాయించిన సంఘటన జరగకుండా ప్రశాంతంగా ఎంపిక జరిగేందుకు పోలీస్ శాఖ కట్టిదిట్టమైన చర్యలు చేపట్టింది దీంతో ఇంతకాలం టిఆర్ఎస్ కౌన్సిలర్లుగా 13 మంది గెలవగా కాంగ్రెస్ పార్టీ 12 మంది అభ్యర్థులు సిపిఎం ఒకటి గెలుపొందగా కాంగ్రెస్ టీఆర్ఎస్ సమానంగా అభ్యర్థులను క్యాంపుకు తరలించారు కానీ వ్యాత్మకంగా కాంగ్రెస్ పార్టీ క్యాంపులో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యూహాత్మకంగా తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు కౌన్సిలర్ అభ్యర్థి పై గురిపెట్టినట్లు జోరుగా చర్చ సాగడం జరుగుతుంది. కానీ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కూడా టిఆర్ఎస్ పార్టీకి 13 ఇద్దరు ఇండిపెండెంట్లు క్యాంపుకు వెళ్ళగా ఉండి ఇద్దరు అభ్యర్థులను కాంగ్రెస్ తిప్పినట్లు సమాచారం. మరో అభ్యర్థి రావడంతో టిఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుందని ఊహాగానాలు జోరుగా ఉపందుకున్నాయి దీంతో టిఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా గోపగోని సుగుణాకర్ గౌడును ప్రతిపాదించినట్లు తెలుస్తుంది కానీ మున్సిపల్ చైర్మన్ ఎంపిక కోసం భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మున్సిపల్ కు రావడంతో ఏం జరుగుతుందనే జోరుగా చర్చ జరుగుతుంది టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందా లేదా టిఆర్ఎస్ పార్టీ వేచి చూడవలసింది.
