37 wards | చైర్మన్–వైస్ చైర్మన్ ఎన్నికలకు పర్యవేక్షణ..

37 wards | చైర్మన్–వైస్ చైర్మన్ ఎన్నికలకు పర్యవేక్షణ..
- రాజ్యాంగబద్ధ ప్రక్రియకు కట్టుదిట్టమైన పోలీస్ భద్రత
37 wards | గద్వాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ మున్సిపాలిటీలో ప్రమాణస్వీకారాలు, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్., సోమవారం రోజు మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. గద్వాల్ మున్సిపాలిటీలోని 37 వార్డులలో ప్రజలు రాజ్యాంగబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించి అభ్యర్థులను ఎన్నుకున్నారు. ఈ క్రమంలో గెలుపొందిన వారందరూ సోమవారం ప్రమాణస్వీకారం చేయనుండగా, అనంతరం చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించబడనుంది.
ఈ పక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రశాంతంగా సాగేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు అమలు చేయబడ్డాయి. ఇదే విధంగా జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలలో కూడా ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

ప్రజలు ప్రలోభాలకు లోనుకాకుండా రాజ్యాంగబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించినట్లే, అభ్యర్థులు కూడా ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. చైర్మన్–వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తయ్యేలా పోలీస్ శాఖ అప్రమత్తంగా పనిచేస్తుందని తెలిపారు.
click here to read more : Mahabubnagar | మాజీ మున్సిపల్ చైర్మన్ అరెస్ట్ సంచలనం..
