విశాఖ . కూర్మన్నపాలెం జాతీయ రహదారి ఆర్టీసీ డిపో ఎదురుగా గురువారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భారీ టిప్పర్ వాహనాన్ని తప్పించబోయి ద్విచక్ర వాహనదారులు కింద పడిపోయారని అదే సమయంలో వెనకనుంచి వస్తున్న ఆర్టిసి బస్సు వాళ్ల తలపై నుంచి వెళ్లిపోవడం వల్ల ఘటనా స్థలంలోనే చనిపోయారని తెలిపారు.
ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృతి దేహాలని కేజీహెచ్ హాస్పిటల్ కి తరలించారు. మృతులు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు దువ్వాడ పోలీసులు.