Shivartri | సర్వం శివోహం..

Shivartri | సర్వం శివోహం..
అంగరంగ వైభవంగా భక్త మార్కండేయ ఆలయంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు..
అలరించిన చిన్నారుల భరతనాట్య నృత్య ప్రదర్శన
Shivartri | నిజామాబాద్ , ఆంధ్రప్రభ: సర్వం శివోహం శివోహం.. శివనామ స్మరణతో భక్తజన సందోహంతో మార్కండేయ భవాని శంక ర ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివ రాత్రి ఉత్సవాలు అంగ రంగ వైభవంగా నిర్వ హించారు. ఆదివారం శివరాత్రి పండుగను పుర స్కరించుకొని నగరంలోని గౌతమ్ నగర్ లో గల శ్రీ భక్త మార్కం డేయ భవాని శంకర శివాలయంలో ఉత్సవాలు వైభవంగా జరుపుకున్నారు. భక్త మార్కండేయ భవాని శంకర ఆలయంలో పద్మ శాలి సంఘం పాలకవర్గం కటకం రాజన్న, బండి సదానందం, పొలం వెంక టేష్ కమిటీ సభ్యులు, సంఘ సభ్యుల ఆధ్వ ర్యంలో ఆదివారం ఉదయ ము సుప్రభాత సేవ అభిషేకములు స్వామి వారి కళ్యాణము పల్లకి సేవ, పార్థీవలింగ మహ ర్చన దీపాలంకరణ, లింగో ద్భవ సమయంలో స్వా మివారికి బిల్వార్చన కార్యక్రమాలు వేదమూ ర్తులైన బ్రాహ్మణులు వెంకటరాజు శర్మ శ్రీనివాస్ శర్మల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
అలరించిన చిన్నారుల భరతనాట్య నృత్య ప్రదర్శన
శివరాత్రి పండుగ ఉత్సవాల్లో భాగంగా శ్రీ భక్త మార్కండేయ భవాని శంకర ఆలయంలో భరతనాట్య నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్య క్రమంలో చిన్నారుల ముఖ్య ప్రదర్శన అలరిం చాయి.
