కడెంలో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు

కడెం ( నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ ; మండల కేంద్రమైన కడెంలో ఆదివారం లంబాడి గిరిజనుల ఆరాధ దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటానికి ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పూజారి తారా సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బోక్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడం పి ఎస్ ఎస్ ఐ పి సాయి కిరణ్ పెద్దూర్ కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయకుమార్ ఉప సర్పంచ్ పిట్టల రాజన్న అల్లంపల్లి మాజీ ఎంపీటీసీ ఎం దాసు నాయక్ బంజారా సేవా సంఘం నాయకులు ఇస్లావత్ మోహన్ నాయక్ బి కిషన్ నాయక్ బి వేణుగోపాల్ సపవట్ రవి విక్రం నాయక్ గంగాధర్ నాయక్ ఇస్లావత్ రాజేష్ నాయక్ బి ఆర్ ఎస్ నాయకులు ముబారక్ అజ్మీర శంకర్ నాయక్ నాగరాజు రాజేష్ నరసయ్య లంబాడి గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply