Driving | ఓవర్‌టేక్ చేస్తే క‌ఠిన చ‌ర్య‌లే…

Driving | ఓవర్‌టేక్ చేస్తే క‌ఠిన చ‌ర్య‌లే…

  • మద్యం సేవించి, సెల్‌ఫోన్ ఉపయోగించి వాహనం నడపకూడదు.
  • డ్రైవింగ్ లైసెన్స్ కలిగినవారే వాహనాలు నడపాలి.
  • విద్యార్థుల ప్రాణాలను కాపాడటం ప్రతి డ్రైవర్ బాధ్యత
  • ఆర్టీఓ గుర్తింపు పొందిన బస్సులను మాత్రమే ఉపయోగించాలి.
  • బస్సు సీట్ల సంఖ్యకు సరిపడే విద్యార్థులే తీసుకెళ్ళాలి.
  • ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలి
  • పాఠశాల బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం

Driving | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : ఓవర్‌టేక్ చేయవద్దు.. రోడ్డు మీద వేగంగా డ్రైవ్ చేయవద్దు..మద్యం సేవించి, సెల్‌ఫోన్ ఉపయోగించి వాహనం నడపరాదు..కేవలం డ్రైవింగ్ లైసెన్స్ కలిగినవారు వాహనాలను నడపాలి. విద్యార్థుల ప్రాణాలను కాపాడటం ప్రతి డ్రైవర్ బాధ్యత అని సీఐ జి. వేణు ఈ సందర్బంగా పేర్కొన్నారు. శనివారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు స్టేషన్ ఘన్ పూర్ సీఐ జి. వేణు ఆధ్వర్యంలో పాఠ శాల బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతా అవగాహన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన డ్రైవర్లకు రహదారి భద్రతా నియ మాలు, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవస రాన్ని వివరించారు. పాఠశాల యాజమాన్యాలను నైపుణ్యం గల డ్రైవ ర్లను నియమించుకోవాలి. విద్యార్థులు ఎక్కే, దిగే సమయంలో మాత్ర మే బస్సులను నిర్ధే శించిన ప్రదేశాల్లో నిలిపి ఉంచాలని సూచించారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ తమ ప్రాణాలను కాపాడు కోవాలన్నారు.

అదనంగా స్కూల్ బస్సులు ఫిట్‌నెస్ లో ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సిలిండర్ తప్ప నిసరిగా ఉండాలని వివరించారు. బస్సు సీట్ల సంఖ్యకు సరిపడే విద్యా ర్థులను మాత్రమే తీసుకెళ్లాలి. డ్రైవింగ్ లైసెన్స్ కలిగినవారు మాత్రమే వాహనాలు నడిపి, ఆర్టీఓ ద్వారా గుర్తింపు పొందిన వాహనాలను ఉపయోగించాలి అని సూచిం చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రాంగ్ రూట్ డ్రైవ్ చేయకుండా పోలీసుల సహకారంతో వాహనాలను నడపా లని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రాజేష్, స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply