Shivratri | ఓం శివోహం…. శివోహం

Shivratri | ఓం శివోహం…. శివోహం
- శివరాత్రి ఉత్సవాలకు ఆలయాల ముస్తాబు
Shivratri | భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ : శివరాత్రి ఉత్సవాలకు పట్టణ కేంద్రంలోని శైవ క్షేత్రాలు ముస్తాబు చేశారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శివుడు తన దివ్య తాండవం చేసిన రాత్రిగా శివరాత్రి ని భక్తులు జరుపుకుంటారు. ఉపవాసాలు, జాగరణ, శివలింగ అభిషేకాలు, శివ, పార్వతుల కళ్యాణం భక్తులకు కనువిందు చేస్తాయి. చీకటి పై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం విజయానికి ప్రతీకగా శివుని ఆరాధన సాగుతుంది.
నందీశ్వరాలయం ముస్తాబు…
నందీశ్వరాలయం ఉత్సవాలకు ముస్తాబు అయ్యింది. సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు పతాని కృష్ణ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి సందర్బంగా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాత్రికి అగ్ని గుండాల కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. శివరాత్రి మరుసటి రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.

