AP | శివరాత్రి హై అలర్ట్..!

AP | శివరాత్రి హై అలర్ట్..!

  • ఆలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
  • డ్రోన్, నైట్ విజన్ కెమెరాలతో 24 గంటల నిఘా
  • వీవీఐపీలు – భారీ భక్తుల రద్దీకి ప్రత్యేక ఏర్పాట్లు

AP | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : మహాశివరాత్రి మహోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. తిమ్మమ్మ మర్రిమాను ఆలయాన్ని జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ శనివారం సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భద్రతా ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. మూడు రోజులపాటు జరిగే మహోత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.

డ్రోన్ కెమెరాలు, నైట్ విజన్ డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా కొనసాగుతుందని వెల్లడించారు. లేపాక్షి, హేమావతి, తిమ్మమ్మ మర్రిమాను, కాటి కోటేశ్వర ఆలయాల వద్ద భారీ కేడింగ్, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కదిరి డీఎస్పీ శివన్నారాయణ స్వామి, సీఐలు నిరంజన్ రెడ్డి, నాగేంద్ర, ఎస్ఐలు నరసింహులు, మక్బూల్ సుమతి, కృష్ణమూర్తి తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply