Nandyala | శ్రీశైలంలో ప్రశాంతంగా స్వామి, అమ్మవార్ల దర్శనాలు…

Nandyala | శ్రీశైలంలో ప్రశాంతంగా స్వామి, అమ్మవార్ల దర్శనాలు…

  • దేవస్థాన కమాండ్ కంట్రోల్ నుంచి నిరంతరం పర్యవేక్షణ…

Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జ్యోతిర్లింగాలలో ఒకటైన నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలంలో ని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ప్రశాంతంగా దర్శన ఏర్పా ట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షేరన్ శనివారం తెలిపారు. శుక్రవారం రోజు సుమారు 84 వెల మంది భక్తులు స్వామి అమ్మవారిని దర్శనం చేసుకున్న రన్నారు.వీరిలో 32,543 శివ స్వాములు ఉన్నారన్నారు . వీరందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి స్పర్శ దర్శనం కల్పించడం జరిగిందన్నారు. అటవీమార్గం ద్వారా (కైలాష్ మార్గంలో) పాదయాత్రగా వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. వీరికి అన్నిరకాల వసతులను కల్పించామన్నారు.

Nandyala

భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా తాగునీరు, భోజన వసతులు, పార్కింగ్ ప్రదేశాలు, తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలు, వైద్య శిబిరాలు తదితర సౌకర్యాల ఏర్పాటు చేశామన్నరు.మహాశివరాత్రి రోజు పాకాల అంకరణకు అన్ని భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందరికీ స్వామి, అమ్మవార్ల దర్శనం జరిగేలా పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. వాటి పర్యవేక్షణకు సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ..పాతాళ గంగ వద్ద ఏర్పాటుచేసిన బందోబస్తును ఏర్పాట్లను పరిశీలించారు.

Nandyala

పుణ్యస్నానాలు ఆచరించే ప్రదేశం వరకు చేరుకున్న అనంతరం అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడుతూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున మెట్ల మార్గం ద్వారా భక్తులు జాగ్రత్తగా వెళ్లాలని మరియు పుణ్యస్నానాలు ఆచరించు భక్తులు అధికారులు ఏర్పాటు చేసిన భద్రతా నిబంధనలు ఉల్లంఘించి ముందుకు వెళ్లరాలని శబ్ద యంత్రం (మైక్)ద్వారా భక్తులకు తెలియజేయాలన్నారు.బోట్ల ద్వారా ప్రయాణికులను విహారయాత్రకు తీసుకువెళ్లే బోటు నిర్వాహకులు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రతి ఒక్క ప్రయాణికుని భద్రత ,రక్షణ దృష్టిలో ఉంచుకోవాలి. లైఫ్ జాకెట్ వేసుకున్న తర్వాతనే ప్రయాణం చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

Leave a Reply