నగర అభివృద్ధి మా ధ్యేయం..

6వ డివిజన్ బీజేపీయే అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డి ఘనవిజయం..
నిజామాబాద్, ఫిబ్రవరి (ఆంధ్రప్రభ )13: నిజామాబాద్ నగరంలోని 6వ డివిజన్లో నెలకొన్న సమస్య లను పరిష్కరించి నగరంలోనే 6వ డివిజన్ ను ఉత్తమ డివి జన్ గా తీర్చిదిద్దుతా నని , నగర అభివృద్ధి మా మా లక్ష్యం మని 6వ డివిజన్ బిజెపి అభ్య ర్థి గోపిడి స్రవంతి రెడ్డి అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రత్యర్థి పై 1000 పై చిలుక తేడాతో విజయం సాధించారు. ఈ సందర్భంగా స్రవంతి రెడ్డి మాట్లాడుతూ ప్రజా సం క్షేమమే ధ్యే యంగా బిజెపి పార్టీ ప్రత్యేక కృషి చేస్తా నని అన్నారు. ఈ భారీ మెజార్టీతో సాధించిన విజ యం డివిజన్ ప్రజలకే సొంత మని సమంత రెడ్డి అన్నారు. డివిజన్ ను ఉత్తమ డివిజన్ గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని ఈ సందర్భంగా తెలిపారు డివిజన్ ప్రజ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
