సీఎం చంద్రబాబు ఆలోచన చేశారు
కోర్టుల డైరెక్షన్ కూడా ఉంది
గత ప్రభుత్వం హడావుడి చేసింది
జీవో ఇచ్చి చేతులు దులుపుకున్న జగన్
అసెంబ్లీలో విమర్శలు గుప్పించిన మంత్రి
వెలగపూడి, ఆంధ్రప్రభ :
త్వరలోనే అర్హత ఉన్నజర్నలిస్ట్ లందరికీ ఇళ్ల స్థలాలిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ప్రస్తుతం జర్నలిస్టుల హౌసింగ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్‌గా దృష్టి పెట్టారని తెలిపారు. ఈ విషయంపై కోర్ట్‌ల డైరెక్షన్ కూడా ఉందని గుర్తుచేశారు. అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని న్యాయం చేస్తామని అన్నారు. జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సభ్యులు కొణతాల రామకృష్ణ, కాల్వ శ్రీనివాసులు సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ.. గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హడావుడి చేసిందని విమర్శించారు. ఒక జీఓ ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.
రెండు లక్షలకు పైగా భూ వివాదాలు ..
రెవెన్యూ సమస్యలు, భూ కబ్జాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు కూడా అనగాని సమాధానం ఇస్తూ, ఏఏ ప్రాంతాల్లో భూముల సర్వే జరుగుతుందో వివరించారు. భూ హక్కులు ఉన్న యజమానికి న్యాయం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగానే ఉన్నాయని తెలిపారు. 2లక్షలకు పైగా ఆర్జీలు భూ వివాదాలపైనే వచ్చాయని అన్నారు. సమగ్ర భూ సర్వే జరుగుతుందని తెలిపారు. గత వైసీపీప్రభుత్వం భూ సర్వేను అవినీతి మాయంగా మార్చిందని మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం భూ సర్వే పేరుతో మంచి నిర్ణయం తీసుకుందని మంత్రి చెప్పారు.
అయిల్ పామ్‌కు ప్రాధాన్యం : మంత్రి అచ్చెన్నాయుడు

అసెంబ్లీ క్వశ్చన్ అవర్‌లో జరిగిన ఆయిల్ పామ్ సాగుపై చర్చలో మంత్రి మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ,. ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. వరికి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఆయిల్ పామ్ సాగు వల్ల లాభాలు కూడా వస్తాయని తెలిపారు. దీంతో పాటు డ్రిప్ ఇరిగేషన్‌పై కూడా దృష్టి పెట్టామని చెప్పారు.
తలసేమియా వ్యాధిపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్

తలసేమియా వ్యాధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి సత్య కుమార్ అన్నారు. తలసేమియా బాధితులకు అన్ని విధాలా న్యాయం చేస్తున్నామని అన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆర్థికంగా అదుకోవాలని విశాఖపట్నం ఉత్తర బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు.. దీనికి స్పందించిన మంత్రి వారికి పెన్షన్ సౌకర్యం కల్పించడంపై దృష్టి పెడతామని తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తలసేమియాపై సమీక్ష నిర్వహిస్తోందని మంత్రి పేర్కొన్నారు.