Dharna | హక్కుల సాధనకై పోరాటాలే శరణ్యం

Dharna | హక్కుల సాధనకై పోరాటాలే శరణ్యం

  • ఉట్నూర్ లో ధర్నా నిరసనలు

Dharna | ఉట్నూర్, ఆంధ్రప్రభ ; కార్మికుల వర్కర్ల డిమాండ్ల సాధనకై పోరాటాలే శరణ్యమని ప్రజా సంఘాల జేఏసీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నేతావత్ రాందాస్ అన్నారు. గురువారం కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఉట్నూర్ అంబేద్కర్ చౌరస్తాలో సిఐటియు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు ఉట్నూర్ ఐపిడిఏ కార్యాలయం ముందు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజా సంఘాల ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నేతావత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ, కార్మికుల కనీస వేతనాలు, సమ్మె చేసుకొనే హక్కు, పని గంటల పెంపు వ్యతిరేకంగా తీసుకువచ్చిన 4 కోడ్ లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Dharna

ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన, వీబి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలనీ, బడ్జెట్ కేటాయింపులు పూర్తి స్తాయిలో కేంద్రమే భరించాలని, రాష్ట్రాల వాటా పెంపు అంటే చట్టాన్ని ఎత్తివేసే కుట్ర అని అన్నారు. విద్యుత్ సంస్కరణ ల పేరుతొ పేదల నడ్డి విరిచే తీసుకువచ్చిన విద్యుత్ సవరణ చట్టం ను రద్దు చేయాలనీ ఆయన అన్నారు. అమెరికా తో కుదుర్చుకున్నవ్యవసాయ,వాణిజ్య ఒప్పందాల వల్ల భారత వ్యవసాయ, రైతాంగ ప్రజలు తీవ్రఇబ్బందులకుగురికావాల్సి వస్తుందని అన్నారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలనీ, ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని, విద్యుత్ సవరణ చట్టంను, భారత వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే అమెరికా తో చేసుకున్న వ్యవసాయ, వాణిజ్య ఒప్పందాల నుండి వైదొలగాలని డిమాండ్ చేశారు.మధ్యభారతం లో జరుగుతున్న ఆదివాసీల హననం ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మల్లేష్, ఆశన్న, అంగన్వాడీ వర్కర్లు, గ్రామపంచాయతీ కార్మికులు, హమాలీ కార్మికులు, అన్ని వర్గాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply