Clues Team | గుణదలలో కలకలం

Clues Team | గుణదలలో కలకలం
Clues Team | విజయవాడ, క్రైమ్, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని గుణదలలో పాత కారులో వ్యక్తి మృతదేహం బయటపడటం కలకలం రేపింది. గుణదల రామవరప్పాడు రింగ్ నుంచి విజయవాడ వైపుకు వచ్చే రహదారి పక్కన నిలిపి ఉంచిన కారులో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీంతో కలిసి ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు మంగళగిరి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గుణదల మేరీమాత తిరునాళ్లకు వచ్చి కారులో నిద్రలోనే మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
