Training | ఆర్టీసీ విజయోత్సవ సభలో పరకాల డీఎంకు సన్మానం

Training | ఆర్టీసీ విజయోత్సవ సభలో పరకాల డీఎంకు సన్మానం

Training | పరకాల, ఆంధ్రప్రభ : ఆర్టిసి విజయోత్సవ సభలో పరకాల డిపో మేనేజర్ రాంప్రసాద్ ను సన్మానించారు. ఈ రోజు మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ 2026 మహా జాతర యొక్క విజయోత్సవ సభను జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ వరంగల్ లో రీజనల్ మేనేజర్ విజయ భాను అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ విజయోత్సవ సభకు కరీంనగర్ జోన్ ఈడి సాల్మన్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేడారం జాతరను అందరూ కలిసి సమిష్టి కృషితో విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉందని ఈడి సాల్మన్ రాజ్ తెలిపారు.

ఈ సమావేశంలో పరకాల డిపో మేనేజర్ జి రాంప్రసాద్ ను శాలువతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ ఈ రాజశ్రీ , ఆఫీస్ సూపర్వైజర్లు ఎ సుధాకర్, సిహెచ్ ఈశ్వర్, సేఫ్టీ వార్డెన్ శంకరయ్య, ఎస్డిఐ మొయిజుద్దీన్ మరియు ఏ డబ్ల్యూ మెంబర్స్ జి నాగలక్ష్మి మరియు ఈ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply