England Open 2025 | తొలి రౌండ్ లోనే ప్ర‌ణ‌య్ ఇంటికి !

బర్మింగామ్ : ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఛాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో భారత్ కు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ హెచ్ఎస్ ప్రణయ్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు.

ఈరోజు (మంగళవారం) బర్మింగ్‌హామ్‌లోని యుటిలిటా అరీనాలో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో.. ఫ్రాన్స్‌కు చెందిన టోమా పోవోవ్‌తో తలపడిన ప్రణయ్, వరుస గేమ్‌లలో 19-21, 16-21 తేడాతో ఓడిపోయాడు. దీంతో, ఇంగ్లాండ్ ఓపెన్ తొలి రౌండ్ నుంచి ప్రణయ్‌ ఇంటిముఖం ప‌ట్టాడు.

ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ 2025 బ్యాడ్మింటన్ భారత జట్టు..

  • పురుషుల సింగిల్స్: లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ (ఎలిమినేటెడ్)
  • పురుషుల డబుల్స్: సాత్విక్ – చిరాగ్
  • మహిళల సింగిల్స్: పీవీ సింధు, మాళవిక బన్సోద్
  • మహిళల డబుల్స్: ప్రియా కొంజెంగ్‌బామ్-శృతి మిశ్రా, తనీషా క్రాస్టో-అశ్విని పొన్నప్ప, త్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్
  • మిక్స్‌డ్ డబుల్స్: ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో, రోహన్ కపూర్-రుత్విక గద్దె, సతీష్ కుమార్ కరుణాకరన్-ఆద్య వారియత్

ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ అనేది BWF వరల్డ్ టూర్ క్యాలెండర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ అని చెప్పవచ్చు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇద్దరు భారతీయులు ప్రకాష్ పదుకొనే, పుల్లెల గోపీచంద్ మాత్రమే ఈ టైటిల్‌ను గెలుచుకున్నారు.

అప్‌కమింగ్ టోర్నమెంట్ :

స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో మార్చి 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు స్విస్ ఓపెన్ BWF వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నమెంట్ జరుగ‌నుంది

Leave a Reply