International | జాతీయ కరాటే పోటీల్లో బంగారు పతకం…

International | జాతీయ కరాటే పోటీల్లో బంగారు పతకం…

International | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని లక్ష్మీ పల్లి గ్రామానికి చెందిన విద్యార్థి ఉప్పరి శ్రీరామ్ జాతీయస్థాయి కరాటే పోటీల్లో తన ప్రతిభను చాటి పలువురి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. మారుమూల పల్లె ప్రాంతానికి చెందిన విద్యార్థి బంగారు పథకం సాధించడంతో పలువురు గ్రామస్తులు క్రీడాకారులు ఈ రోజు అభినందించి సన్మానించారు.

హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో 5వ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో ఊట్కూర్ మండల లక్ష్మీ పల్లి గ్రామానికి చెందిన ఉప్పరి బసప్ప మంజుల దంపతుల ప్రథమ కుమారుడు శ్రీరామ్, ఊట్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సీఈసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి శ్రీరామ్ అండర్ 17 లో ప్రతిభా చాటి బంగారు పతకం సాధించారు. గతంలో విద్యార్థి కరాటే లో పలు బహుమతులు పొందారు. బంగారు పతకం సాధించిన విద్యార్థి పలు పతకాలుసాధించారు. దీంతో గ్రామస్తులు కళాశాల అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేసి సన్మానించారు.

Leave a Reply