brs l ప్రజల అండతో మరోసారి విజయం ఖాయం అంటున్న ఆరెపల్లి..

brs l ప్రజల అండతో మరోసారి విజయం ఖాయం అంటున్న ఆరెపల్లి..

మోసపోవద్దు గోసపడతామంటున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరెపల్లి కుమార్

brs l మంథని, ఆంధ్రప్రభ: ప్రజల అండతో ప్రజాక్షేత్రంలో మరోసారి విజయం ఖాయం అంటున్న మాజీ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్. రెండో వార్డ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారంలో అందరికంటే ముందు దూసుకవెళ్తున్నారు. మోసపోవద్దు గోసపడతాం అని నిదానంతో ముమ్మరంగా గడపగడపకు ప్రచారం చేస్తున్నారు. గతంలో ప్రజల కోసం విశేషంగా సేవ చేశారని మరోసారి అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

గడపగడపకు ప్రచారం చేస్తూ ఆత్మీయంగా పలకరిస్తూ ఓటర్ల మనసును గెలుచుకుంటున్నారు. విశ్లేషకుల అంచనాల ప్రకారం రెండో వార్డులో మాజీ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్ ఘనవిజయం సాధించడం ఖాయం. ఇప్పుడు కేవలం మెజార్టీ ఎంత అనేది చర్చనీయంగా మారింది. గెలిచిన తర్వాత పాలకుడిగా కాకుండా సేవకుడిగా పరిపాలన అందజేస్తానని ఆయన తెలిపారు. రెండో వార్డులో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. పారిశుద్ధ నిర్వాహణ, సురక్షితమైన మంచినీటి సరఫరా, పట్టణ ప్రగతి కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. వార్డులోని ప్రజల సమస్యలు తెలుసుకొని యుద్ద ప్రాతిపదికన పరిష్కరించడానికి కార్యచరణ చేపడతానని ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటెయ్యాలని ఆయన కోరారు.

Leave a Reply