brs l పదవ డివిజన్‌లో ‘కారు’ జోరు…

brs l పదవ డివిజన్‌లో ‘కారు’ జోరు…

పాత పాలమూరు,బాలాజీ నగర్‌లో అభ్యర్థి నందిపేట శ్రీనివాసులుకు ప్రజల బ్రహ్మరథం!

brs l మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ: మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదవ డివిజన్‌లో ఎన్నికల సందడి ఉద్ధృతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా పాత పాలమూరు బాలాజీ నగర్‌తో పాటు పరిసర కాలనీల్లో బిఆర్ఎస్ అభ్యర్థి నందిపేట శ్రీనివాసులుకు లభిస్తున్న ప్రజాదరణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి వీధి, ప్రతి కాలనీలో అడుగుపెట్టిన శ్రీనివాసులుకు స్థానికులు బ్రహ్మరథం పడుతూ ఘన స్వాగతం పలుకుతున్నారు. ‘కారు’ గుర్తుతో సాగుతున్న ప్రచార ర్యాలీలు డివిజన్‌లో స్పష్టమైన ఊపును తీసుకొచ్చాయి.

పాలమూరు మున్సిపాలిటీ వ్యవస్థలో ఉన్న సమయంలో కౌన్సిలర్‌గా బాధ్యతలు నిర్వహించిన నందిపేట శ్రీనివాసులు, అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహకారంతో త్రాగునీరు, సిసి రోడ్, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ప్రజలు గుర్తుచేస్తున్నారు. అభివృద్ధితో పాటు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా, సమస్యలను విన్న వెంటనే స్పందించే సౌమ్య స్వభావం కలిగిన వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.కార్పొరేషన్ ఏర్పడిన తరువాత డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్న ప్రజలు, అనుభవం ఉన్న నాయకుడిగా మరోసారి నందిపేట శ్రీనివాసులను కార్పొరేటర్‌గా ఎన్నుకుంటే పదవ డివిజన్ మరింత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజాసేవే లక్ష్యంగా, అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న శ్రీనివాసులుకు ఈసారి కూడా భారీ మెజారిటీతో విజయాన్ని అందించాలని ప్రజలు సంకల్పం వ్యక్తం చేస్తుండటం గమనార్హం

Leave a Reply