బ్యాటు గుర్తుకు ఓటు వేసి దీవించండి…

బ్యాటు గుర్తుకు ఓటు వేసి దీవించండి…

  • 30 వ వార్డు అభ్యర్థి గొల్ల విజయలక్ష్మి ఆంజనేయులు

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి పట్టణ 30వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొల్ల విజయలక్ష్మి–ఆంజనేయులు బ్యాటు గుర్తుకు ఓటు వేసి దీవించాలని వార్డు ప్రజలను కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా వార్డు ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నానని ఆమె తెలిపారు.

వార్డు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు శ్రేయశక్తులా కృషి చేస్తానని విజయలక్ష్మి–ఆంజనేయులు హామీ ఇచ్చారు. 30వ వార్డు సమగ్ర అభివృద్ధికి నిరంతరం పాటు పడతానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జనార్దన్, రాజు, అఖిల్, తూర్పు ఆంజనేయులు, తుల్జారామ్, శ్రీధర్ రెడ్డి, నరసన్న, దేవదాస్ తదితర కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply