మీ బిడ్డగా ఆదరించండి…వార్డు అభివృద్ధి నా బాధ్యత

మీ బిడ్డగా ఆదరించండి…వార్డు అభివృద్ధి నా బాధ్యత
- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్రం హరినాథ్
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : మొదటిసారి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న నాకు ఒక అవకాశం ఇవ్వండి…మాటలతో కాదు, పనులతో అభివృద్ధి చేసి చూపిస్తాను. ఒక మీ ఇంటి బిడ్డగా అందరినీ మనస్ఫూర్తిగా అడుగుతున్నాను..మీ ఆశీర్వాదమే నా బలమని స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీలోని 2వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుర్రం హరినాథ్ పోటీ చేస్తు న్నారు. ఈ సందర్భంగా గురువారం ప్రచారంలో భాగంగా వార్డులోని నెల కొన్న పలు సమస్యలను గుర్తించి వార్డు అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్రం హరినాథ్ కాలనీ వాసులకు పలు కీలక హామీలు ఇచ్చా రు.
ఎస్సీ కాలనీలో ప్రాధా న్యతగా సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఏర్పాటు చేస్తామని తెలి పారు. రైల్వే ఎస్సీ కాలనీ వెనుక ఉన్న దారిని వెడల్పు చేసి, మోరీలు, వీధి దీపాల ఏర్పాటు చేపడతామని పేర్కొన్నారు. అలాగే ఎస్సీ కాలనీలో ఫంక్షన్ హాల్, చౌరస్తాలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయను న్నట్లు వెల్లడించారు. స్థలము లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటా యించడమే కాకుండా, గౌడ్ కాలనీలో డ్రైనేజీ, వీధి దీపాలు, సీసీ రోడ్డు, అంగన్వాడీ భవనం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
రోడ్డు పక్కన అడ్డు గా ఉన్న విద్యుత్ స్థంభాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు. వార్డులో 30 నుంచి 50 ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని, అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహాలు అందేలా కృషి చేస్తానన్నారు. రేషన్ కార్డులు, సీఎం ఆర్‌ఎఫ్, పింఛన్ల మంజూరులో ఎలాం టి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. స్మశానవాటికలో కాంపౌండ్ హాల్, స్నానపు డ్రెస్సింగ్ రూములు ఏర్పాటు చేయడంతో పాటు యువతకు క్రీడల్లో ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. హై స్కూల్‌లో ఓపెన్ జిమ్ ఏర్పాటు కూడా తన లక్ష్యమన్నారు.
-శివునిపల్లి కాంగ్రెస్‌కు కంచుకోట :
పార్టీ కార్యకర్తగా ఇప్పటికే పలువురికి ఇండ్లు ఇప్పించానని ఈ సంద ర్బంగా గుర్తు చేశారు. శివునిపల్లి కాంగ్రెస్‌కు కంచుకోట అని పేర్కొ న్నారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లోనే వచ్చాయని చెప్పారు. గత పాలకులు అభివృద్ధిని పట్టించు కోకుండా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు సన్నబియ్యం వంటి సంక్షేమ పథకాలు అమ లవుతున్నాయని వివరించారు.
ఇంటింటి ప్రచారంలో ఓటర్ల స్పందన బాగానే ఉందని, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య ఆశీస్సులతో వార్డును ఉత్తమ వార్డుగా తీర్చిదిద్దేందుకు ముందడుగు వేశానని తెలిపారు. ఈ సందర్భంగా ఓటర్లను సీరియల్ నెంబర్ 2 చెయ్యి గుర్తు కు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీలు రజాక్ యాదవ్, కోతి రాములు పాల్గొన్నారు.
