Megastar | చిరంజీవి–బాబీ మూవీలో కృతి శెట్టి ఔట్..? సారా అర్జున్ ఎంట్రీ ఖరారేనా..?

Megastar | చిరంజీవి–బాబీ మూవీలో కృతి శెట్టి ఔట్..? సారా అర్జున్ ఎంట్రీ ఖరారేనా..?

  • చిరు నెక్ట్స్ మూవీపై భారీ అంచనాలు
  • గ్యాంగ్‌స్టర్ స్టోరీలో సెంటిమెంట్ టచ్
  • చిరంజీవి కూతురు పాత్రకు ప్రాధాన్యత
  • కృతి శెట్టి స్థానంలో సారా అర్జున్..?
  • త్వరలో అధికారిక ప్రకటన

Megastar | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి సరికొత్త రికార్డులు సెట్ చేశారు. దీంతో నెక్ట్స్ మూవీ పై మరింత క్రేజ్ ఏర్పడింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీతో (Director Bobby) చిరంజీవి ఓ భారీ చిత్రం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ హీరోయిన్ సారా అర్జున్ నటించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ నిజమేనా..?

Megastar

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ ఈ ఇద్దరి కాంబోలో వాల్తేరు వీరయ్య అనే సినిమా రూపొందడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. అయితే.. ఈసారి చిరును రెగ్యులర్ గా కాకుండా సరికొత్తగా చూపించబోతున్నాట. ఇంకా చెప్పాలంటే.. ఆయన ఏజ్ కు తగ్గట్టుగా ఉంటూనే పవర్ ఫుల్ గా ఉండే స్టోరీ రెడీ చేశాడట బాబీ. ఈ కథలో కొత్తదనం ఉండడం వలనే మెగాస్టార్ (Megastar) ఈ మూవీకి ఓకే చెప్పారని తెలిసింది. గ్యాంగ్ స్టర్ మూవీగా రూపొందే ఈ సినిమాలో యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా ఉంటుందట. అభిమానులు కోరుకునే అంశాలు ఉంటూనే వైవిధ్యంగా ఉండేలా బాబీ ప్లాన్ చేశాడట.

Megastar

అయితే.. ఈ సినిమాలో చిరంజీవికి కూతురు ఉంటుందట. ఈ పాత్ర చాలా కీలకమట. అయితే.. ఈ పాత్ర కోసం కృతి శెట్టిని తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఆతర్వాత ఒకరిద్దరి పేర్లు వినిపించాయి కానీ.. ఉప్పెన బేబమ్మ దాదాపు కన్ ఫర్మ్ అంటూ ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు ధురందర్ మూవీలో హీరోయిన్ గా నటించి.. అందరి దృష్టిని ఆకర్షించిన సారా అర్జున్ అయితే.. బాగుంటుందని బాబీ కాంటాక్ట్ అయ్యాడని.. కథ విని సారా అర్జున్ గ్రీన్ సిగ్నల్ (Green Signal) ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇది నిజమా..? కాదా..? అనేది తెలియాల్సివుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎండింగ్ కి వచ్చింది. త్వరలోనే పూర్తి వివరాలను అఫిసియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం.

Megastar

CLICK HERE TO READ ఇంట్రెస్టింగ్.. కమల్ స్క్రీన్ టైమ్ షాక్ ..?

CLICK HERE TO READ MORE

Leave a Reply