Nursery | ఇది పెంట కుప్ప కాదు.. నర్సరీ

Nursery | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండలంలోని పీచర గ్రామంలో లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన నర్సరీ చెత్తా చెదారాలతో పెంట కుప్పను తలపిస్తూంది. పచ్చని చెట్లతో కళకళలాడాల్సిన నర్సరీ చెత్త కుప్పలతో దుర్భరంగా తయారు అయింది. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం నిండా కనిపిస్తుంది. ఇకనైనా అధికారులు స్పందించి చెత్త తొలగించే ఏర్పాట్లు చేస్తారేమో చూడాలి.
