Ropeway Bridge | పని మొదలయ్యేనా?

Ropeway Bridge | పని మొదలయ్యేనా?

  • అది ఒక కలగా మిగిలేనా!

Ropeway Bridge | అడ్డతీగల, ఆంధ్రప్రభ : అడ్డతీగల మండలం భీముడు పాకలు పంచాయతీ పింజరకొండ గ్రామస్తులకు ఏళ్ల తరబడి పింజరకొండ వాగు వల్ల కష్టాలు తప్పడం లేదు. వర్షాకాలంలో ఆ నాలుగు నెలలు రాకపోకలు నిలిచిపోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. స్వతంత్రం వచ్చి దశబ్దాలు గడుస్తున్నప్పటికీ పింజరికొండ వాగు పై ఎటువంటి వంతెనలు నిర్మించకపోవడంతో నేటికీ ఆ గ్రామానికి చెందిన గిరిజనులు అభివృద్ధికి ఆమడ దూరంలోనే జీవనం సాగిస్తున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన మొదటి రోజులలో పింజరకొండ గ్రామానికి చెందిన వెలుగుల జ్యోతి అనే గర్భిణీ ఎల్లవరం పీహెచ్సీలో సాధారణ డెలివరీ అయ్యి తదుపరి తమ గ్రామానికి వెళ్లే సమయంలో ఏలేరు వాగు వరద నీటిని దాటి ప్రయాణించవలసిన పరిస్థితిలో గ్రామస్తులు డెలివరీ అయినా వెలుగుల జ్యోతిని ఆమె బిడ్డని కాలువను దాటించే పరిస్థితిలో వారి భుజాలు పై ఎత్తుకొని ప్రమాద స్థాయి దాడి ప్రవహిస్తున్న ఆ ఏరులో, ఏరు దాటిస్తున్న దృశ్యం ఆ రోజుల్లో అన్ని పత్రికాలలోనూ సోషల్ మీడియాలోనూ రావడంతో మన గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెంటనే స్పందించి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకొని వెళ్లడంతో అధికారుల అంచనాల ప్రకారము బ్రిడ్జి నిర్మాణానికి గాను 70 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రకటించడం జరిగింది.

రోప్ వే బ్రిడ్జి మంజూరు చేసినట్లు పత్రికలలో మీడియాలోనూ కథనాలు రావడంతో ఈప్రాంత గిరిజనులు హర్షాతిరేకలు వ్యక్తం చేయడం జరిగింది అయితే ఆ సంవత్సరం వర్షాకాలం అయిపోయిన వెంటనే పనులు మొదలు పెడతారు అనుకున్నప్పటికీ పనులు ప్రారంభించక పోవడంతో గిరిజనుల ఆశలు అడియాసులయ్యాయి.మల్లా రెండో సంవత్సరం వర్షాకాలం ముగిసినప్పటికి బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలెట్టక పోవడంతో గిరిజనులలో ప్రభుత్వంపై వ్యతిరేకత కనబడుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి పింజరకొండ వాగుపై రోఫ్ వే బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టాలని పింజరి కొండ గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Leave a Reply