TG | ముగిసిన శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాలు

TG | ముగిసిన శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాలు

  • వైభోవంగా సత్యదేవుడి రథోత్సవం, ఏకాంత సేవ

TG | దండేపల్లి, ఆంద్రప్రభ : దండేపల్లి మండలం గూడెం శ్రీసత్యనారాయణస్వామి దేవస్థానంలో స్వామి వారి బ్రహ్మోత్సవంలో భాగంగా సోమవారంతో బ్రహ్మోత్సవాలు వేడుకలు ముగిశాయి. సత్యదేవుడిలయంలో ఘనంగా రధోత్సవ వేడుకలను ఆలయ అర్చకబృందం, సిబ్బంది నిర్వహించారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలను రథోత్సవంలో అలంకరించి ఆలయ అర్చకులు, వేద పండితులు వేదమంత్రోచ్ఛరణతో రధోత్సవాన్నికి పూజలు చేసి ప్రారంభించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను సత్యదేవున్నిప్రదానలయం చుట్టు ప్రదక్షణ చేపట్టారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఉత్సవ విగ్రహాలతో ఆలయ అర్చకులు, సిబ్బంది రంగులు చల్లుకుంటు ఆనందోత్సవ మధ్య నృత్యాలు చేశారు. సప్తాహ భజన కార్యక్రమం ముగించగా, అనంతరం ఆలయంలో రాత్రి 7గంటలకు సత్యదేవునికి ఏకాంత సేవతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది, అర్చకులు, సిబ్బంది, భజన కళాకారులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply