TG | విద్యార్థులకు ప్రోత్సహాకాలు అందజేయ‌డం అభినందనీయం

TG | విద్యార్థులకు ప్రోత్సహాకాలు అందజేయ‌డం అభినందనీయం

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ

TG | నిజామాబాద్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు నగదు ప్రోత్సాహ కాలు అందేలా కార్యక్రమం చేపట్టడం అభినందనీ యమని అర్బన్ ఎమ్మె ల్యే ధన్పాల్ సూర్యనా రాయణ అన్నారు. విద్యా ర్థుల్లో పోటీతత్వాన్ని పెంచేలా ఇలాంటి కార్యక్రమం చేపట్ట డంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు నగరంలో డీఎస్ఎన్ కార్యా లయం లో మిషన్ టెన్త్ క్లాస్ బ్రోచర్ ను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారా యణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడారు. చిట్ ఫండ్స్ సంస్థ లలో నమ్మ కమైన సంస్థ శ్రీరామ్ చిట్ ఫండ్స్ అని, అదే సంస్థ వారు సామాజిక దృక్ప థంతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూ రెన్స్ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యా ర్థులకు ప్రోత్సాహక బహు మతి కింద రాష్ట్ర స్థాయి నుండి మండల స్థాయి వరకు నగదు ప్రోత్సాహం అందివ్వడం చాలా అభినందనీయమని కొని యాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యా ర్థులను ప్రోత్సహిం చేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూ రెన్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మిషన్ 10th క్లాస్” లో భాగంగా 10వ తరగతి లో రాష్ట్రవ్యా ప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ మార్కు లు సాధించిన వారికి రూ. 2.2 కోట్ల నగదు బహు మతిని అందివ్వడానికి ముందుకు రావడం సంతో షకరమైన విషయం అన్నా రు. తెలంగాణ రాష్ట్రవ్యా ప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 2026 మార్చిలో జరిగే పదవ తరగతి పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ కనబ రిచిన విద్యార్థులకు భారీ నగదు బహుమతులను అందించనున్నట్లు ఈ సంద ర్భంగా నిర్వాహకులు తమ కు తెలిపినట్లు ఎమ్మెల్యే వివరించారు.

ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో 10వ తరగతిలో అత్యు త్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.5 లక్షల నగదు బహుమతి, రెండో స్థానంలో ప్రతిభ కనబరి చిన విద్యార్థులకు రూ. 3 లక్షల నగదు బహుమతితో పాటు జిల్లా స్థాయిలో ప్రతి భ కనబరిచిన విద్యార్థులకు రూ. 2 లక్షల నగదు బహుమతి అలాగే ఒక్కో నియోజకవర్గంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు లక్ష రూపాయల చొప్పున నగదు బహుమతి, మండల స్థాయిలో ప్రతిభ కనబరి చిన విద్యార్థులకు రూ. 10 వేల నగదు బహుమ తుల ను ఇన్సూరెన్స్ కంపె నీ వారు అందజేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ పథకం ప్రభుత్వ పాఠశాలలో చదివే ఆణిముత్యాల లాంటి విద్యార్థులకు ఒక చక్కటి వరమని, ప్రభుత్వ పాఠశాలలు అని నిరాశతో ఉన్నవారికి చక్కని అవకాశమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ తల్లిదండ్రులు కలలను నెరవేర్చాలని పేర్కొన్నారు. ఇలాంటి పథకాలు విద్యా ర్థుల్లో పోటీతత్వాన్ని పెంచి వారి లక్ష్య సాధనకు తోడ్పడతాయని కొనియాడారు.ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డి.జి.ఎం. రాము, సీనియర్ డి.ఎం. తానాజీ, బ్రాంచ్ మేనేజర్ ఎ. కిషోర్, డెవల ప్‌మెంట్ ఆఫీసర్లు సి.హెచ్. రాజు, పి. రాజేందర్, ఎ. సుదర్శన్, పి. వాసుగౌడ్, ఎస్. చంద్రశేఖర్, ఎం. సత్యనారాయణ, గణేష్, బాలరాజు, సంపత్, నాగేష్ పాల్గొన్నారు.

Leave a Reply