Telangana | హైదరాబాద్‌కు గుడ్ న్యూస్‌

Telangana | హైదరాబాద్‌కు గుడ్ న్యూస్‌

  • మూడు భారీ హైస్పీడ్ ట్రైన్ కారిడార్లు
  • లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌లో కేటాయింపు

Telangana | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో తెలంగాణకు భారీ ప్రాజెక్టులను కేటాయించారు. ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న హైస్పీడ్ ట్రైన్ కారిడార్ల ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేస్తూ, దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన 7 కారిడార్లలో ఏకంగా మూడు హైదరాబాద్ కేంద్రంగా ఉండటం విశేషం. హైదరాబాద్ నుంచి దక్షిణ, పశ్చిమ భారత దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ మూడు హైస్పీడ్ మెట్రో ట్రైన్ కారిడార్లను కేంద్రం ప్రకటించింది.

హైదరాబాద్ – పుణె, హైదరాబాద్ – బెంగళూరు, హైదరాబాద్ – చెన్నై ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే గంటల కొద్దీ సాగే ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ముఖ్యంగా ఐటీ నిపుణులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఇది వరంలా మారనుంది. రవాణా వ్యవస్థ వేగవంతం కావడంతో పాటు, ఈ మార్గాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం లభించనుంది. హైదరాబాద్ ఒక ప్రధాన ఆర్థిక హబ్‌గా ఎదగడానికి ఈ కారిడార్లు దోహదపడతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇవే కాకుండా ముంబై-పుణె, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాశి, వారణాశి-సిలిగుడి మధ్య కూడా హైస్పీడ్ కారిడార్లను ప్రభుత్వం ప్రకటించింది.

Leave a Reply