Chinthagattu | జాతరలో పోలీసుల సేవలు ప్రశంసనీయం

Chinthagattu | జాతరలో పోలీసుల సేవలు ప్రశంసనీయం
- అమ్మవారి రాక నుంచి వనప్రవేశం వరకు అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం
- సీఐ వేణు ఆధ్వర్యంలో పకడ్బందీ బందోబస్త్
- మహిళలు, చిన్నారులకు ప్రత్యేక భద్రత
- నాలుగు రోజుల పాటు శాంతియుతంగా జాతర ముగింపు
Chinthagattu | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామ పరిధిలోని చింతగట్టు సమ్మక్కసారలమ్మ జాతర నాలుగు రోజుల పాటు ఎలాంటి అవాంఛ నీయ ఘటనలు లేకుండా శాంతియుతంగా సాగడంలో పోలీస్ శాఖ సేవలు అభినందనీయం అయ్యాయి. అమ్మవార్లను గద్దెలకు తీసుకు వచ్చిన క్షణం నుంచే వనప్రవేశం వరకు సీఐ వేణు ఆధ్వర్యంలో పకడ్బం దీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

ఎస్‌ఐలు వినయ్, రాజేష్‌లు తమ సిబ్బందితో కలిసి భక్తుల రాకపోకలను క్రమబద్ధీకరించడంతో పాటు జాతర ప్రాంతమంతా నిరంతర పర్యవేక్షణ కొనసాగించారు. జాతర ప్రారంభం నుంచి ముగింపు వరకు ట్రాఫిక్ నియంత్రణ, గుంపుల నిర్వహణ, భక్తుల సజావు రాకపోకల విషయంలో పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. ఎక్కడైనా స్వల్ప సమస్య తలెత్తిన వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

ప్రత్యేకంగా మహిళలు, చిన్నారులకు అవసరమైన సహాయం అందిస్తూ మానవీ యతతో విధులు నిర్వహించడం భక్తులను ఆకట్టుకుంది. నాలుగు రోజుల పాటు నిద్రలేని సేవలతో జాతరను సురక్షితంగా ముగించడంలో పోలీస్ సిబ్బంది చూపిన అంకితభావాన్ని భక్తులు, స్థానికులు శబాష్ పోలీస్ అంటూ కొనియాడారు. చింతగట్టు సమ్మక్క సారలమ్మ జాతర శాంతియుతంగా ముగిసిందంటే అందుకు పోలీస్ శాఖ చేసిన సేవలే ప్రధాన కారణమని పలువురు అభిప్రాయపడ్డారు.

