Meet | కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ..

Meet | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్ లో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు, విచారణ సంబంధిత అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అలాగే ప్రభుత్వ వైఖరి, ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన వ్యూహాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. మరోవైపు నిన్న ఇదే ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో హరీష్ రావు భేటీ అయిన విషయం తెలిసిందే.
