Governor visits | అమ్మవార్లను దర్శించుకున్న గవర్నర్

Governor visits | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మేడారం లో శ్రీ సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తులాభారం నిర్వహించి బంగారం సమర్పించారు. గవర్నర్కు మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ రాంనాధ్ కేకన్ ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించిన ఆయన, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.




