Tributes | గాంధీజీకి ఘన నివాళి

Tributes | భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ గాంధీ హిల్ ఫౌండేషన్ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 78 వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ పాతబస్తీలోని గాంధీ హిల్ పై నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆవిష్కరించారు. అనంతరం కొండ పై ఉన్న గాంధీ స్థూపం వద్ద శ్రద్దాంజలి ఘటించారు.
కార్యక్రమంలో గాంధీహిల్ ఫౌండేషన్ చైర్మన్ , ప్రభుత్వ సలహాదారు కేపీసీ గాంధీ , జాయింట్ సెక్రటరీ శారద, సభ్యురాలు రష్మి, సిద్దార్ధ లా కళాశాల ప్రిన్సిపల్ చెన్నుపాటి దివాకర్ బాబు, మాజీ మేయర్ జంధ్యాల శంకర్, మాజీ ఐఏఎస్ దమయంతి , గాంధీ స్మారక నిధి కోశాధికారి డోగిపర్తి శంకరరావు. ఎఫ్ట్రానిక్స్ చైర్మన్ దాసరి రామక్రిష్ణ, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.
