suspended | మగ్గిడి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెన్షన్

suspended | మగ్గిడి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెన్షన్
- ఆంధ్రప్రభ కథనానికి స్పందన
suspended | ధర్మపురి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా, ధర్మపురి (మం), మగ్గిడిలోని టీజీఎంఎస్ ప్రిన్సిపాల్ కడారి పద్మను సస్పెండ్ చేస్తూ పాఠశాల విద్యా సంచాలకులు ఉత్తర్వులు విడుదల చేశారు. “నేనే రాజు నేనే మంత్రి” అనే శీర్షికతో ఆంధ్రప్రభ దినపత్రికలో తేది:28.12.2025న ప్రచురితమైన కథనానికి ఉన్నత అధికారులు స్పందించారు. అధికారుల వివరణాత్మక విచారణ నివేదిక ద్వారా జగిత్యాల జిల్లా, ధర్మపురి (మం), మగ్గిడిలోని టిజిఎంఎస్ ప్రిన్సిపాల్ కడారి పద్మ తన చట్టబద్ధమైన విధులను నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని, విద్యార్థులను వేధిస్తున్నారని మరియు ఎస్ఎస్సి విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహించడం లేదని, అలాగే పాఠశాల పరిపాలనను పర్యవేక్షించడంలో విఫలమయ్యారని అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ప్రిన్సిపాల్ కడారి పద్మపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని అధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

