petition | స్థ‌ల కేటాయింపున‌కు విన‌తి

petition | నార్సింగి, ఆంధ్ర‌ప్ర‌భ : నార్సింగి మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్ర‌హ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాల‌ని కోరుతూ సిహెచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో స్నేహ యూత్ అసోసియేషన్, అంబేద్కర్ యూత్ అసోసియేషన్ సభ్యులు గ్రామపంచాయతీ ఈవో నాగభూషణంకు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని, వారి ఆశయాలను భావితరాలకు తెలియజేయాలంటే విగ్ర‌హ ఏర్పాటుకు ప్రత్యేక స్థలం అవసరమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారులు సానుకూలంగా స్పందించాల‌ని కోరారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఈవో నాగభూషణం హామీ ఇచ్చారు.

Leave a Reply