Janagama | కారెక్కిన కాంగ్రెస్ నాయకులు

Janagama | జనగామ ఆంధ్రప్రభ : జనగామ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తోటే కృష్ణ, తోటే నర్సింగ్‌లు ఈ రోజు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మోసపూరిత కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
