Edapalli | మిస్టరీ వీడింది…

Edapalli | మిస్టరీ వీడింది…
- మృతిచెందిన బాలికది మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖేడ్ ప్రాంతం
- గుర్తించిన పోలీసులు
Edapalli | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ శివారులోని డీ-46 కెనాల్‌లో గురువారం లభ్యమైన గుర్తు తెలియని బాలిక మృతదేహం మిస్టరీ వీడింది. సోషల్ మీడియా ద్వారా వచ్చిన వార్తల ఆధారంగా ఆ బాలిక వివరాలు వెల్లడయ్యాయి. మృతి చెందిన బాలిక మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖేడ్ ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతోంది. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. రూరల్ సీఐ విజయ్ బాబు మాట్లాడుతూ, “మేము అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. బాలిక కుటుంబ సభ్యులను గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం” అని చెప్పారు.
