Child marriages | బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చుదాం…

Child marriages | బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చుదాం…
- వాల్ పోస్టర్లు ఆవిష్కరించిన అధికారులు,
Child marriages | చిట్యాల, ఆంధ్రప్రభ : బాల్య వివాహాలు, సమాజ అభివృద్ధికి అవరోధం అనిమహిళ సాధికారత కేంద్రం ఇన్ ఛార్జ్ మిషన్ కో ఆర్డినేటర్ క్రిష్ణ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వెంచరామి పూరేడు గుట్ట మినీ మేడారం జాతరలో గురువారం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి సూచనలతో బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా జిల్లా మహిళ సాధికారత కేంద్రం ఆద్వర్యంలో అవగాహన కార్యక్రమం, స్టాల్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల తాసిల్దార్ ఇమామ్ బాబా, ఎస్సై శ్రావణ్ కుమార్ అతిధులుగా పాల్గొని వాల్ పోస్టర్ లు ఆవిష్కరణ చేశారు, మహిళ సాధికారత కేంద్రం ఇన్ ఛార్జ్ మిషన్ కో ఆర్డినేటర్ క్రిష్ణ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు సమాజ అభివృద్ధికి అవరోధం అని తెలిపారు, బాల్య వివాహాలు బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. జెండర్ స్పెషలిస్ట్ అనూష మాట్లాడుతూ… బాలికల రక్షణ, విద్యా ప్రాముఖ్యత, మహిళా సాధికారత అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రజల చేత బాల్య వివాహ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో మహిళ సాధికారత సిబ్బంది మమత, సురేష్, పోలీస్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
