Wines | వ్యక్తికి తీవ్ర గాయాలు

Wines | వ్యక్తికి తీవ్ర గాయాలు
Wines | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండలంలోని కనకాపూర్ వైన్స్ వద్ద ఇద్దరు వ్యక్తులు గొడవ పడి తీవ్రంగా గాయ పర్చుకున్న ఘటన ఈ రోజు చోటు చేసుకుంది. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం… ఈ రోజు మధ్యాహ్నం 1 గంటల సమయంలో రాచాపూర్ గ్రామానికి చెందిన జడ రజనీకాంత్ అను అతను పని నిమిత్తం కనకాపూర్ గ్రామంకి వెళ్ళాడు. అనంతరం కనకపూర్ వైన్స్ నందు మద్యం తీసుకుంటూ ఉండగా అదే సమయంలో వారి గ్రామానికి చెందిన తక్కల సాయికుమార్ అను అతను వైన్స్ దగ్గరికి వచ్చి జడ రజనీకాంత్ కు మద్యం తాగిపించు అని అడుగగా అతను నావద్ద డబ్బులు లేవని చెప్పినా అతను వినలేదు.
అతనికి చెప్పకుండా అతని పేరుపై తినుబండారాలు తీసుకొనగా అప్పుడు రజనీకాంత్ ఎందుకు నా పేరున తీసుకున్నావు అంటే వారి మధ్య మాట మీద మాట పెరిగి తక్కల సాయికుమార్ అక్కడే ఉన్న ఖాళీ బీరు బాటిల్ తీసుకుని రజిని ముఖంపై, దవడపై, కుడి చేయి పై కొట్టగా రక్తపు గాయాలు అయ్యాయి. అక్కడ ఉన్న గ్రామస్తులు చికిత్స నిమిత్తం జడ రజనీకాంత్ కు ప్రభుత్వాసుపత్రి నిర్మల్ కు అంబులెన్స్ ద్వారా తీసుకొని వెళ్లినట్లు తెలిపారు. జడ రజనీకాంత్ భార్య రాజశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మణ్ చాంద్ హెడ్ కానిస్టేబుల్ మంద వీర ప్రకాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
