Junk food | ఆర్థిక సర్వే… కీలక సూచనలు

Junk food | ఆర్థిక సర్వే… కీలక సూచనలు
Junk food | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అధిక కొవ్వు, చక్కెర కలిగిన అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం పెరుగుతుండడంపై ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జంక్ ఫుడ్ ప్రకటనలను నిషేధించాలని సూచించింది. అంతేకాకుండా శిశువులకు పట్టించే పాలు, శీతలపానీయాల మార్కెటింగ్‌ను పరిమితం చేయాలని పిలుపునిచ్చింది. జంక్ ఫుడ్ ఉత్పత్తులపై అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఎంత వినియోగించారో హెచ్చరించేలా న్యూట్రిషన్ లేబుల్‌ను ముద్రించాలని సూచించింది.
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ని పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. దేశం బలమైన వృద్ధి పథంలోనే ఉందని తెలిపింది. జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతం నుంచి 7.2 శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది. ఈ క్రమంలోనే అధిక కొవ్వు, చక్కెర ఉండే అత్యంత ప్రాసెస్ చేసే ఆహార పదార్థాల వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రమంలో ఆర్థిక సర్వే పలు సూచనలు చేసింది.
ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం విధించాలని, అందుకు సంబంధించిన అవకాశాలను పరిశీలించాలని పేర్కొంది. అలాగే పసి పిల్లలు, చిన్నారుల పాల ఉత్పత్తులు, డ్రింక్స్ మార్కెటింగ్‌పైనా ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చింది.
