invitation | వినూత్న నిర్ణయం…

invitation | వినూత్న నిర్ణయం…
- గ్రామ సభకు రావాలని అధికారులకు ఆహ్వానం
invitation | జైనూర్, ఆంధ్రప్రభ : గ్రామ సమస్యలు పరిష్కరించడానికి గ్రామ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడానికి కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పాన పటార్ గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ ఆత్రం తులసి బాయి ఒక కొత్త వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. సహజంగా గ్రామపంచాయతీలో నిర్వహించే గ్రామ సభకు మండల ఎంపీడీవో, ఎంపీవో, వార్డు సభ్యుల సమక్షంలో నిర్వహిస్తారు. కేవలం మండల సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖల అధికారులు హాజరు కావడం సహజం.

కానీ ఈ నూతన సర్పంచ్ గ్రామపంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి, పాలనా సేవలు మెరుగుపరచడానికి, సమస్యలు పరిష్కరించడానికి ఒక మంచి ఆలోచనతో గ్రామ పంచాయతీలో ఈనెల 30న శుక్రవారం నిర్వహించే గ్రామ సభకు హాజరు కావాలని మండల స్థాయి అన్ని శాఖల ముఖ్య అధికారులతో పాటు పోలీస్ స్టేషన్లో సైతం కలిసి ఆహ్వాన పత్రాలను ఈ రోజు అందజేశారు.
ఇంతవరకు ఎవరు కూడా పంచాయతీ గ్రామ సభకు మండల స్థాయి అధికారులకు హాజరుకావాలని ఆహ్వానించలేదు. ఈ నూతన సర్పంచ్ తీసుకున్న కొత్త వినూత్న నిర్ణయానికి చాలామంది ప్రశంసిస్తున్నారు. అన్ని మండల స్థాయి అధికారులు గ్రామ సభకు వస్తే వారికి సమస్యలు తెలుస్తాయని ఆ శాఖల ద్వారా వారు పరిష్కరిస్తారని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నూతన సర్పంచ్ తులసి శంకర్ తెలిపారు. ఆహ్వానంఅందజేత కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంతియాజులాల, నాయకులు, మండల ఉపాధ్యక్షుడు ఆత్రం శంకర్, తదితరులు పాల్గొన్నారు.
