MULUGU | తన్నుకొస్తున్న పాతాళగంగ

MULUGU | తన్నుకొస్తున్న పాతాళగంగ
- బోరునర్సాపురంలో విచిత్రం
MULUGU | ములుగు, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా మంగపేట మండలం బోరునర్సాపురంలో ఓ రైతుకు చెందిన బోరు పైపులో నుంచి నురగ నీరు వస్తుండడంతో రైతులు, స్థానికులు ఆశ్చర్యం చెండుతున్నారు. ఇందుకు సంబంధించి బోరు నర్సాపురంకు చెందిన మైల చిన్నకు చెందిన వ్యవసాయ భూమిలో పంట సాగు కోసం కొన్ని సంవత్సరాల క్రితం బోరు వేశారు. అయితే గత కొద్ది సంవత్సరాల నుంచి బోరు నుంచి సరిగా నీళ్లు రాకపోవడంతో పొలంలో మరో చోట బోరు వేసి మొదట వేసిన బోరులోని మోటార్ కొత్త బోరులో వేసి వ్యవసాయం సాగు చేస్తున్నారు.
మొదట వేసిన బోరుకు సంబంధించి కేవలం కేసింగ్ ( గొట్టాలు ) మాత్రమే భూమిలో ఉన్నాయి. కాగా.. భూమిలో ఉన్న కేసింగ్ పైపు సుమారు 120 అడుగుల లోతు నుంచి కొద్ది రోజులుగా నురగతో ఉన్న నీరు బయటకు తన్నుకు వస్తుంది. ఉదయం సబ్బు నురగలా వస్తున్న నీరు ఎండ వచ్చే సమయంలో నురగ కరిగి మామూలు నీళ్లులా వస్తున్నాయి. ఈ విచిత్ర సంఘటన చూసి చుట్టు ప్రక్కల రైతులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
