Awards | అవార్డులతో వెల్ది మోడల్ స్కూల్‌కు గౌరవం

Awards | అవార్డులతో వెల్ది మోడల్ స్కూల్‌కు గౌరవం
Awards | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్‌లో ఇంగ్లీష్ లెక్చరర్లుగా విధులు నిర్వహిస్తున్న కందగట్ల గణేష్ కి గురురత్న లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, బొల్లికొండ విజయకి గురురత్న ఉత్తమ మహిళా ఉపాధ్యాయ అవార్డు లభించడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. ఈ అవార్డులను ఇటీవల చెన్నైలోని అమెట్ యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్సలర్ డా.రామచంద్రన్ ఘనంగా ప్రదానం చేశారు.
ఈసందర్భంగా బుధవారం తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ వెల్దిలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాఠశాల ప్రిన్సిపాల్ పాలకుర్తి శ్రీధర్ అవార్డు గ్రహీతలను శాలువాలతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వారి సేవలు విద్యార్థులకు, సమాజానికి ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ అభినందన కార్యక్రమంలో ఉపాధ్యాయులు జయశ్రీ, మల్లం శ్రీధర్, రుద్రమదేవి, వినీలా, సౌజన్య ప్రియ, రాజు, పార్వతి, శ్రీను, షహానా సుల్తానా, మోహన్ రావు, రవి, శశికుమారి, మాలతి, లలిత, సురేఖ, వసంత మాధురి, రాజయ్య, బాలరాజు తదితరులు పాల్గొని అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
