TG | ముప్పై వేల మందికిపైగా భక్తుల రాక…

TG | ముప్పై వేల మందికిపైగా భక్తుల రాక…

TG | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : మల్లన్నగండి వద్ద తాటికొండ, జిట్టగూడెం గ్రామాల ఆధ్వర్యంలో నిర్వ హించనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ జాత రకు డాక్టర్ కడియం కావ్య ఎంపీ నిధుల నుంచి రూ.6.49 లక్షలు వెచ్చించి రోడ్డు మరమ్మత్తులు, హైమాస్ట్ లైట్ల ఏర్పాటు పనులు పూర్తి చేశారు. అలాగే ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిధుల నుంచి రూ.7.50 లక్షలు ఖర్చు చేసి నీటి సరఫరా సౌకర్యాలు, దేవాలయ నిర్మాణ పను లు చేపట్టారు. మొత్తంగా జాతరకు సంబందించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాతర వ్యవస్థా పకులు రాపోలు మధుసూదన్ రెడ్డి, జాతర గౌరవ అధ్యక్షులు చల్లా సుధీర్ రెడ్డి, జాతర చైర్మన్‌లు మారపాక సుజనా శ్రీనివాస్, బానోత్ బాలు నాయక్ అధికారుల సహకారంతో రోడ్లు, తాగునీటి సదుపాయా లు, విద్యుత్ సరఫరా, శానిటేషన్, లైటింగ్, డ్రింకింగ్ వాటర్, శాంతి భద్ర తల ఏర్పాట్లు సమర్థంగా నిర్వహించారు. ప్రతి ఏటా దాదాపు 25 వేల మంది భక్తులు ఈ జాతరకు తరలివస్తుండగా, ఈ సంవత్సరం 30 వేల మందికి పైగా భక్తులు హాజరవుతారని జాతర కమిటీ అంచనా వేస్తోంది. జాతరను సక్రమంగా నిర్వహించేందుకు సెక్రటరీలు సురేందర్, నర్మదా, అశోక్ ఆధ్వర్యంలో శానిటేషన్, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈరోజు సారలమ్మ గద్దెల వద్దకు చేరుకోనుండగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జాతర ప్రాంగణమంతా భక్తిశ్రద్ధతో కళకళలాడుతోంది.

TG

-మల్లన్నగండి సమ్మక్క సారలమ్మ జాతర ప్రస్థానం:

2007 సంవత్సరంలో సమ్మక్క, సారలమ్మ వనదేవతల దీవెనలతో గ్రామాలు చల్లగా, సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో అన్ని కులాల పెద్దలు కలిసి జాతర నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణ యాన్ని తాటికొండ గ్రామానికి చెందిన రాపోలు మధుసూదన్ రెడ్డి ఎంతో ప్రాముఖ్యతతో స్వీకరించి, అందరి సమక్షంలో తాటికొండ జిట్ట గూడెం గ్రామాల పరిధిలోని మల్లన్నగండి వద్ద గద్దెల నిర్మాణాన్ని చేప ట్టారు. మేడారం ప్రధాన పూజారి సిద్ధబోయిన వెంకన్న చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించి సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా ప్రారంభించారు. అప్పటి నుంచి గత 19 సంవత్సరాలుగా ఈ జాతరను భక్తి శ్రద్ధలతో, వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు.

-జాతరకు నూతన వన్నె తీసుకొచ్చిన ఎంపీ, ఎమ్మెల్యే:

గద్దెల ప్రాంగణం విస్తీర్ణం పరిమితంగా ఉండటంతో జాతర తేదీల్లో భక్తుల రద్దీ కారణంగా గద్దెల ప్రారంభం వద్ద అమ్మల దర్శణానికి కష్ట సాధ్యంగా మారేది. ఈ నేపథ్యంలో గద్దెల పునర్నిర్మాణ పనులకు ఎంపీ, ఎమ్మెల్యే నిధులతో చేపట్టి జాతరకు నూతన వన్నె తీసుకొచ్చారు. ఈసారి జాతర కోసం ప్రత్యేక రూపకల్పనతో పాటు నిర్మాణ పనులను ఏకకాలంలో చేపట్టడం విశేషం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగ కుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలి పారు.

-ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసాం: జాతర గౌరవ అధ్యక్షులు చల్లా సుధీర్ రెడ్డి

తాటికొండ జిట్టాగూడెం గ్రామాల పరిధిలో జరిగే సమ్మక్కసారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. ముఖ్యంగా లైటింగ్, పార్కిం గ్, టాయిలెట్స్, శానిటేషన్, డ్రింకిం గ్ వాటర్, క్యూ లైన్లు అన్ని సిద్ధం చేసాం. ఇప్పటికే భక్తులు తరలి వస్తున్నారు. భక్తులు అందరూ పెద్ద ఎత్తున జాతరకు తరలిరావాలని కోరుకుంటున్నాం.

Leave a Reply