Ajit Pawar | పైలట్ల నుంచి మేడే కాల్ రాలేదు : డీజీసీఏ

Ajit Pawar | పైలట్ల నుంచి మేడే కాల్ రాలేదు : డీజీసీఏ

Ajit Pawar | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ ప్రయాణిస్తున్న విమానం ఇవాళ ఉదయం కుప్పకూలిన ఘటనకు సంబంధించి కీలక విషయం వెల్లడైంది. ల్యాండింగ్‌ సమయంలో రన్‌వేను గుర్తించడంలో పైలట్లకు ఇబ్బందులు ఎదురైనట్లు తెలిసింది.

తొలి ప్రయత్నంలో రన్‌వే కనిపించకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొట్టారని, రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే ముందు గో ఎరౌండ్‌ పాటించినట్లు సమాచారం. ఈ క్రమంలో పైలట్ల నుంచి ఆపదలో ఉన్నామని తెలియజేసే మేడే కాల్స్‌ లేవని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply