kurnool | 10 పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి

kurnool | 10 పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

kurnool | కర్నూలుబ్యూరో, ఆంధ్రప్రభ : పదవవ తరగతి పబ్లిక్ పరీక్షలలో 85 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించే విధంగా లక్ష్యం పెట్టుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి విద్యార్థులకు తెలిపారు. బుధవారం కోడుమూరు మండలం వర్కూరు గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ 10 వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో తాగునీరు ఏ విధంగా ఉన్నాయి, టాయిలెట్లు శుభ్రంగా ఉంటున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల చదువు బాగుందని, ముఖ్యంగా చేతిరాత చాలా బాగుందని కలెక్టర్ విద్యార్థులను మెచ్చుకున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్తున్న పాఠాలు, మ్యాథ్స్ అర్థమవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.. పాఠశాలలో ముందురోజు నిర్వహించిన సోషల్ స్టడీస్ యూనిట్ పరీక్ష గురించి కలెక్టర్ ప్రస్తావిస్తూ సోషల్ పరీక్షలో 20 కి 20 మార్కులు ముగ్గురికి రాగా, 10 లోపు మార్కులు వచ్చిన విద్యార్థులను పిలిచి బాగా చదవాలని కలెక్టర్ సూచించారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల కోసం ప్రతి రోజు ఉదయం 7:30 గంటల నుండి ప్రత్యేక తరగతులు (రెమెడియల్ క్లాసెస్) నిర్వహించాలని కలెక్టర్ పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. 8వ తరగతి నుండి డిగ్రీ వరకు కష్టపడి బాగా చదివి ఉద్యోగాలు సంపాదించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.. బాల్య వివాహాలు నేరమని కలెక్టర్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డి ఈ ఓ సుధాకర్, బీసీ సంక్షేమ శాఖ అధికారిని ప్రసున్న , పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply