Warangal | ఇప్పగూడెం చింతగట్టు జాతరకు సర్వం సిద్ధం

Warangal | ఇప్పగూడెం చింతగట్టు జాతరకు సర్వం సిద్ధం

  • భక్తిశ్రద్ధతో కళకళలాడుతున్న జాతర ప్రాంగణం
  • జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే శ్రీహరి ప్రత్యేక దృష్టి
  • రూ.19 లక్షలతో రోడ్లు, నీరు, శానిటేషన్ ఏర్పాటు
  • హైమాక్స్ లైట్లు అందించిన ఎంపీ కడియం కావ్య
  • నేటి నుంచి 31వ తేదీ వరకు వైభవ జాతర
  • ఎల్లమ్మ పండుగతో జాతర ఘన ఆరంభం
  • నేడు సారలమ్మ రాక..వేలాదిగా తరలివస్తున్న భక్తులు

Warangal | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : ఇప్పగూడెం చింతగట్టు సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధం చేశారు. నేటి నుంచి 31వ తేదీ వరకు జాతర నిర్వహిస్తారు. ఈ జాత రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ సరఫరా, శానిటేషన్, లైటింగ్, పార్కిం గ్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, క్యూ లైన్లు, శాంతి భద్రతల ఏర్పాట్లు సమర్థంగా నిర్వహించారు.

మంగ ళవారం రాత్రి ఎల్లమ్మ పండుగతో జాతర ఘనంగా ప్రారంభమైంది. జాతర పూజారులను మత్స్యశాఖ సొసైటీ పెద్దలు జాతర కమిటీ చైర్మ న్‌కు అధికారికంగా అప్పగించారు. నేడు సారలమ్మ గద్దెల వద్దకు చేరు కోనుండగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జాతర ప్రాంగణ మంతా భక్తిశ్రద్ధతో కళకళలాడుతోంది.

  • జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి:
Warangal |

చింతగట్టు సమ్మక్క, సారలమ్మ జాతరను భక్తులకు ఎలాంటి అసౌ కర్యం కలగకుండా నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యే కడియం ప్రత్యే కంగా శ్రద్ధ తీసుకున్నారు. భక్తుల కోసం నీటి సరఫరా, శానిటేషన్ ఏర్పా ట్లకు సుమారు రూ.9 లక్షలు మంజూరు చేయించగా, రోడ్డు మరమ్మ తుల కోసం పంచాయతీ రాజ్ శాఖ నుంచి మరో రూ.10 లక్షలు నిధు లు కేటాయింపజేశారు.

Warangal |

ఈ నిధులతో కోమటి గూడెం బీటీ నుంచి సమ్మక్క గద్దెల వరకు, ఎర్రగట్టమ్మ ఆలయం నుంచి సమ్మక్క గద్దెల వరకు ఒక రోడ్డు, సమ్మక్క గద్దెల నుంచి ఇప్పగూడెం వైపు శివాలయం (నాగులమ్మ దేవాలయం)వరకు ముఖ్య మార్గాలపై రోడ్డు మరమ్మతు లు చేపట్టారు. అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పాత విద్యుత్ లైన్లను పునరుద్ధరించి, అవసరమైన చోట్ల గతం కంటే ఎక్కువ సామర్థ్యంతో కొత్త లైన్లు ఏర్పాటు చేయించారు. జాతర ప్రాంగణంలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇందుకు తోడుగా కడియం కావ్య స్వయంగా సుమారు రూ.2 లక్షల విలువైన హైమాక్స్ లైట్లను అందించి, రాత్రి వేళల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు.

Warangal |
  • అందరి సహకారంతో జాతర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా : జాతర చైర్మన్ తోట వెంకన్న

గతంలో నిర్వహించిన జాతర ఆదాయం నుంచి ఖర్చులు పోను దేవా లయం పేరు మీద సుమారు రూ.5 లక్షలు నిల్వ ఉన్నాయి. ప్రస్తుత జాతరకు సంబంధించి టెండర్ల ద్వారా దాదాపు రూ. పదిహేడున్నర లక్షల ఆదాయం సమకూరింది. అన్ని కులాల కార్యక్రమాల ఖర్చులు పెరిగినప్పటికీ, సుమారు రూ.10 లక్షలు నిల్వగా మిగిల్చి, భవిష్యత్ అభివృద్ధికి వినియోగించాలనే నిర్ణయం తీసుకుంటాం. ఎమ్మెల్యే, ఎంపీ, దాతల సహకారంతో మూడు ప్రధాన ఆర్చిలు ఇప్పగూడెం, ఎర్రఘట్ట మ్మ, సముద్రాల స్టేజ్ ప్రాంతాల్లో నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తు న్నాం.

Warangal |

అలాగే కౌపిండ్ వాల్ ప్రాంతంలో చింతగట్టు సమ్మక్క కార్యాల యాన్ని ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ సహకారంతో ఏర్పాటు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. అవినీతి, అక్రమాలు జరగకుండా, వృధా ఖర్చులు కాకుండా గౌరవ ఎమ్మెల్యే నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. అనం తరం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసాం. అందరి సహకారంతో జాతర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు.

  • ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసాం : జాతర వైస్ చైర్మన్ మ్యాదరవేణ కర్ణాకర్

ఇప్పగూడెం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బం దులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. ముఖ్యంగా లైటింగ్, పార్కిం గ్, టాయిలెట్స్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, క్యూ లైన్లు అన్ని సిద్ధం చేసాం.. ఇప్పటికే భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. భక్తులు అంద రూ పెద్ద ఎత్తున జాతరకు తరలిరావాలి.

CLICK HERE TO READ MORE : sanitation in 2026 | మేడారం జాతరలో ప్లాస్టిక్ ముప్పు.. నివారణకు తెలంగాణ ప్రభుత్వ కఠిన చర్యలు

CLICK HERE TO READ MORE :

Leave a Reply