Cricket | రాష్ట్రస్థాయి క్రికెట్ బహుమతుల ప్రధానోత్సవం

Cricket | రాష్ట్రస్థాయి క్రికెట్ బహుమతుల ప్రధానోత్సవం

  • కాంగ్రెస్ నాయకులు కసిరెడ్డి నవీన్ రెడ్డి
  • దంతాలపల్లి సర్పంచ్ పున్నోటి బాలాజీ

Cricket | దంతాలపల్లి, ఆంధ్రప్రభ : మండలం పెద్ద ముప్పారం గ్రామంలో రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు,సంక్రాంతికి ప్రారంభమైన క్రికెట్ టోర్నమెంట్,ఈరోజు ఫైనల్ జరగడంతో పెద్ద ముప్పారానికి రెండవ బహుమతి లభించింది. ఈ బహుమతి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కసిరెడ్డి నవీన్ రెడ్డి, దంతాలపల్లి సర్పంచ్ పొన్నోటి బాలాజీ చేతుల మీదుగా తీసుకోవడం జరిగిందని క్రికెట్ కెప్టెన్ శ్రీనివాస చారి తెలియజేశారు.

మొదటి బహుమతి ఎనేకుంట తండకి రావడం జరిగింది మూడవ బహుమతి తొర్రూర్ క్రికెట్ టీమ్ అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగానవీన్ రెడ్డి మాట్లాడుతూ… ఆటల్లో యూత్ మంచిగా రాణించాల‌న్నారు. కెప్టెన్ శ్రీనివాసచారి మాట్లాడుతూ… రెండో బహుమతి వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని ఎక్కడ టోర్నమెంట్ జరిగినా మేం వెళ్తామని యూత్ ఇంకా ముందు ముందు టోర్నమెంట్లు నిర్వహించాలని, యూత్ చురుగ్గా పాల్గొనాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, వార్డ్ నెంబర్ రవి, సభ్యులు గణేష్, భీష్మ, విష్ణు, చింటూ, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Cricket |

Leave a Reply